Khakee: The Bengal Chapter | ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్(Netflix India)లో రాబోతున్న ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ (Khakee: The Bengal Chapter). ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ దర్శకుడు నీరజ్ పాండే (Neeraj Pandey) కథను అందిస్తుండగా.. దేబత్మ మండల్, తుషార్ కాంతి రే సంయుక్తంగా దర్శకత్వం వహించారు. బెంగాలీ దిగ్గజ నటుడు ప్రోసెంజిత్ చటర్జీ (Prosenjit Chatterjee), జీత్(Jeet), పరమ్బ్రత చటర్జీ(Parambrata Chatterjee), చిత్రాంగద సింగ్(Chitrangada Singh) తదితరులు ఈ వెబ్ సిరీస్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2000లో నిజాయితీగా ఉన్న అర్జున్ మైత్రా అనే ఐపీఎస్ అధికారి కథగా ఈ వెబ్ సిరీస్ రాబోతుండగా.. నెట్ఫ్లిక్స్లో 2025 మార్చి 20న ప్రీమియర్ కానుంది.
అయితే ఈ వెబ్ సిరీస్లో క్రికెటర్ సౌరవ్ గంగులీ అతిథి పాత్రలో మెరవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరుగగా.. ఈ వేడుకలో మీడియా.. నీరజ్ పాండేను అడుగుతూ.. ఈ చిత్రంలో దాదా ఉన్నాడా అంటూ అడిగారు. దీనికి నీరజ్ సమాధానమిస్తూ.. చూస్తూ ఉండండి అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. దీంతో సౌరవ్ నటించబోతున్నట్లు నీరజ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు గంగూలీ పోలీస్ డ్రెస్లో ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫొటో గమనిస్తే.. ఖాకీ వెబ్ సిరీస్లో దాదా ఉన్నట్లు తెలుస్తుంది.