Imax in Hyderabad | తెలుగు మూవీ లవర్స్ ఐమాక్స్ ఫార్మాట్‌కి దూరమై దాదాపు 10 ఏండ్లు గడుస్తున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు ఐమాక్స్ ఫార్మాట్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ఉండగా.. దాని నిర్వహాణ ఖర్చులు ఎక్కువ అవ్వడంతో దానిని తొలగించి ఆ స్థానంలో పీసీఎక్స్ను తీసుకోచ్చారు ప్రసాద్ నిర్వహాకులు. అయితే హాలీవుడ్ సినిమాలతో పాటు మన దగ్గర వచ్చిన పలు ఇండియన్ సినిమాలను ఐమాక్స్ ఫార్మాట్లో చూద్దామనుకుంటే అభిమానులకు నిరాశ ఎదురయ్యేది. అయితే తాజాగా మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్ చెబుతూ మళ్లీ హైదరాబాద్‌లో ఐమాక్స్ ఫార్మాట్ రాబోతుంది.
ప్రముఖ నిర్మాత, ఏషియన్ సినిమాస్ అధిపతి సునీల్ నారంగ్ ఒక కొత్త ఐమాక్స్ థియేటర్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఐమాక్స్ థియేటర్‌ను హకింపేట్‌లో నిర్మిస్తున్నట్లు.. మరో రెండేళ్లలో ఇది అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వార్త తెలుగు సినీ ప్రేక్షకులను కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు ఈ వార్త మహేశ్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. SSMB29 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్ మరో ఏడాదికి కానీ విడుదల అయ్యేలా లేదు. అయితే ఈ సినిమా వచ్చేలోపు ఐమాక్స్ ఫార్మాట్ హైదరాబాద్‌లో అందుబాటులోకి వస్తే.. సినిమాను ఐమాక్స్ స్క్రీన్‌పై చూడవచ్చని మహేశ్ అభిమానులు ఆశ పడుతున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.