Ileana | గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెని చూస్తే యూత్‌కి పిచ్చెక్కిపోయేది. కెరీర్ సజావుగా సాగుతున్న సమయంలో ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఇలియానాని ఇబ్బందుల్లోకి నెట్టాయి. దేవదాసు సినిమాతో ఇలియానా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే గతేడాది 2023లో ఇలియానా మైఖేల్ డోలన్‌ను వివాహం చేసుకున్నారు. అదే సంవత్సరం ఏప్రిల్‌లో తన తొలి గర్భాన్ని ప్రకటించారు. ఆగస్టులో కుమారుడు కోవా ఫోనిక్స్ డోలన్ కి జన్మనివ్వగా ప్రస్తుతం ఇలియానా తన రెండో బిడ్డ కోసం ఆనందంగా ఎదురు చూస్తున్నారు.
ఇలియానా ప్రస్తుతం మాతృత్వపు క్షణాల్ని ఆస్వాదిస్తున్నారు.. అందుకే సినిమాల్ని చేయలేదు. ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా బిడ్డపైనే ఉందని చెప్పుకొచ్చారు. నాకు డైపర్లు మార్చే టైం కూడా ఉండటం లేదు.. నా బిడ్డతోనే బిజీగా ఉంటున్నాను అని ఫన్నీగా ఇలియానా సమాధానం ఇచ్చారు. ఇక ఇలియానాని ఓ నెటిజన్ ఫస్ట్ టైం గర్భం దాల్చాను.. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పమని కోరగా, తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ఎక్కువగా ఆలోచించొద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు. ఇప్పుడు రెస్ట్ తీసుకునే సమయం. ఇంట్లో వాళ్ల సాయం తీసుకోండని సలహా ఇచ్చింది. మాతృత్వపు అనుభూతిని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని అడగ్గా, దానికి స్పందిస్తూ.. ఈ ఫేజ్ ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు.. నేను ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఉంది.. ప్రతీ రోజూ 24 గంటలు రెస్ట్ అన్నదే ఉండటం లేదు.
అయితే ఎంత కష్టం అనిపించిన కూడా నా బిడ్డ నవ్వు, ఆ స్పర్శతో అన్నీ కూడా మాయం అవుతున్నాయి. మాతృత్వం అనేది గొప్ప ఫీలింగ్ అని పేర్కొంది. సినిమాలు ఎందుకు చేయడం లేదు అని ఇంకొకరు అడిగే.. బిడ్డ ఫోటోను షేర్ చేశారు ఇలియానా. ఇక పెళ్లి గురించి ఓ నెటిజన్ అడిగాడు. మీకు పెళ్లి అయిందా? లేదంటే కేవలం బిడ్డను మాత్రమే కన్నారా? అని అడగడంతో కాస్త వెరైటీ సమాధానం ఇచ్చింది. ఆలోచిస్తున్నట్టుగా, ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న అని పేర్కొంది. మొత్తానికి నెటిజన్స్ తో సరదాగా
ముచ్చటించింది ఇలియానా.