Ileana D’Cruz | ‘దేవదాసు’ (Devadasu) సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమానే తెలుగులో తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పోకిరి (Pokiri)తో ఇండస్ట్రీ హిట్ సాధించింది. ఈ సినిమా తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అయితే సినిమాల విషయం పక్కన పెడితే ఇలియానా తన ప్రియుడిని పెళ్లి చేసుకొని తల్లిగా మారిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 1న ఈ బ్యూటీ పండంటి మగ బిడ్డకు (Baby boy) జన్మనిచ్చింది. అప్పుడే ‘కోవా ఫీనిక్స్ డోలన్’ అంటూ పేరు కూడా పెట్టేసింది. ప్రస్తుతం తన బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూ అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది.
ఇదిలావుంటే తాను ప్రెగ్నన్సీ తర్వాత డిప్రెషన్‌కు గురవుతున్నట్లు ఒక పోస్ట్ పెట్టింది. డెలివరీ (Delivery) తర్వాత ప్రతి ఒక్కరికి డిప్రెషన్ ( Depression ) అనేది సర్వసాధారణంగా ఉంటుంది. అయితే నేను దాని నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. డెలివరీ తర్వాత నిద్రలేమి సమస్యలు నన్ను వెంటాడుతున్నాయి. వాటి నుంచి బయటపడటం కోసం ప్రతి రోజు వ్యాయామం( Exercise ) చేస్తున్నాను. కొన్నిసార్లు వ్యాయామం చేయటానికి కూడా సమయం కేటాయించలేకపోతున్నాను. నా కుటుంబం ప్రతీ విషయంలో నాకు తోడుగా ఉంది. నేను కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఇక తాను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి చాలా రోజులైందని ప్రస్తుతం నేను తన కొడుకు ఆలనా పాలన చూసుకుంటూ బిజీగా ఉండటం వల్ల పోస్ట్ చేయలేకపోతున్నానని ఇలియానా ఇన్‌స్టాలో రాసుకోచ్చింది.