Ilayaraja | సంగీత ప్రపంచంలో ఇళయరాజా ఓ దిట్ట.మనసును మధు కలశంలా మార్చి స్వర సురధారలు కురిపించే లయ రాజా ఇళయరాజా. ఆయన సంగీత వాయిద్యంపై ధ్వనించే ప్రతి శబ్దంపైనా పట్టు సంపాదించుకున్నాడు. ఉన్నది సప్తస్వరాలే అయిన వాటితో రాజా పలికించే రాగాలెన్నో. ఇళయరాజా సంగీతం మనకు ఎప్పుడు వినసొంపుగానే ఉంటుంది. అయితే ఇళయరాజా ఎంతో మంది స్టార్ సింగర్స్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఆయన కూడా కొన్ని పాటలు ఆలపించారు. అవి సూపర్ హిట్ కూడా అయ్యాయి. అయితే లేడీ వాయిస్ తో ఇళయరాజా పాడిన హిట్ సాంగ్ మీకు ఎవరికైన తెలుసా? ఇప్పటి వారికి అయితే ఏ మాత్రం తెలియకపోవచ్చు.
ఇళయరాజాకి సంగీతంపై ఆసక్తి కలగడానికి కారణం ఆయన అన్నయ్య పావలర్. సంగీత కళాకారుడైన అతను కమ్యూనిస్ట్ ప్రచార సభలలో ఎక్కువగా కచేరీలు చేసేవారు. అలా ఆయన రాసిన పాటని ఇళయరాజా వాడుకున్నాడు. అయితే ఓ సారి కమ్యూనిస్ట్ పార్టీ ప్రచారం కోసం పావలర్ ఇళయరాజాను పిలిచి లేడీ వాయిస్‌లో పాడమని చెప్పాడట. ఆ పాటలో పురుషుడి గొంతుతో వచ్చే లైన్స్‌ని పావలర్ ఆలపించగా, స్త్రీ గొంతులో వచ్చే లైన్లను ఇళయరాజా పాడారు. ‘ఒత్త రూవాయిం తారేన్ నాన్ ఉప్పుమా కాఫీయుం తారేన్ అని ఇళయరాజా ఆలపించగా ; ఓటు పోడుర పొన్నే నీ మాట్ట పాత్తు పోడు’ అని పావలర్ పాడారు.
ఈ పాట ఏంటంటే స్త్రీ చెప్పిన మాట పురుషుడు విని కమ్యూనిస్టులకే ఓటు వేయడానికి అంగీకరించేలా పావలర్ ఆ పాటను రాశారు. ఆ పాటనే ఇళయరాజా మళ్లీ రీ కంపోజ్ చేయడం విశేషం. ఇక ఈ మధ్యే లండన్ లో సింఫనీ వినిపించి విజయవంతంగా తిరిగి వచ్చారు ఇళయరాజా. ఈ క్రమంలో ఆయన తొలి చిత్ర కథానాయకుడు శివకుమార్ ఇళయరాజాకు ఓ బంగారుగొలుసు కానుకగా ఇచ్చారు. శివకుమార్ అంటే మరెవరో కాదు సూర్య, కార్తిల తండ్రి . ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన తొలి చిత్రం ‘అణ్ణక్కిళి కాగా,ఈ మూవీ 1976 మార్చి 14న విడుదలయింది. ఈ చిత్రంలో శివకుమార్ హీరోగా నటించగా, సుజాత నాయికగా కనిపించారు. ఇందులోని ఇళయరాజా స్వరాలు సంగీతాభిమానులను మంత్ర ముగ్ధులని చేశాయి.