IIFA Digital Awards 2025 | భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఐఫా’ ఓటీటీ అవార్డ్స్ వేడుక (IIFA Digital Awards 2025) రాజస్థాన్‌లోని జైపూర్‌లోని జైపూర్ ఎగ్జిబిషన్ & కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకలో నటులు కార్తిక్ ఆర్యన్, కరణ్ జోహర్, కృతి సనన్, మధురి దీక్షిత్‌తో పాటు షాహిద్ కపూర్‌తో పాటు కరీనా కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు వచ్చి సందడి చేశారు. ఇక ఈ అవార్డులలో పంజాబీ గాయకుడు అమర్ సింగ్ చమ్కీలా జీవితాన్ని ఆధారంగా చేసుకుని వచ్చిన అమర్ సింగ్ చంకీలా(Amar Singh Chamkila) సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకోగా.. ఉత్తమ నటుడిగా విక్రాంత్ మస్సే, ఉత్తమ నటిగా కృతి సనన్ అవార్డులు అందుకున్నారు. ఈ అవార్డులు ఎవరిని వరించింది చూసుకుంటే..!
‘ఐఫా’ ఓటీటీ అవార్డ్స్ విజేతలు
ఉత్తమ చిత్రం (వెబ్ ఒరిజినల్) : అమర్ సింగ్ చమ్కీలా (నెట్‌ఫ్లిక్స్)
ఉత్తమ నటుడు: విక్రాంత్ మస్సే (సెక్టార్ 36) (నెట్‌ఫ్లిక్స్)
ఉత్తమ నటి: కృతి సనన్ (దో పత్తి) (నెట్‌ఫ్లిక్స్)
ఉత్తమ వెబ్ సిరీస్ : పంచాయత్ సీజన్ 3 (ప్రైమ్ వీడియో)
ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చంకీలా)
ఉత్తమ సహాయ నటుడు: దీపక్ – సెక్టార్ 36
ఉత్తమ సహాయ నటి: అనుప్రియా గోయెంకా – బెర్లిన్ (జీ5)
ఉత్తమ కథ : కనికా ధిల్లాన్ – దో పత్తి
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: యో యో హనీ సింగ్: ఫేమస్
ఉత్తమ నటుడు (వెబ్ సిరీస్): జితేంద్ర కుమార్ (పంచాయత్ 3)
ఉత్తమ నటి (వెబ్ సిరీస్) : శ్రేయాచౌదరి (బందీశ్ బందిట్స్ సీజన్ 2) (ప్రైమ్ వీడియో)
ఉత్తమ దర్శకుడు (వెబ్ సిరీస్): దీపక్ కుమార్ మిశ్రా (పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ సహాయ నటుడు (వెబ్ సిరీస్): ఫైజల్ మాలిక్ (పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ సహాయ నటి (వెబ్ సిరీస్) : సంజీదా షేక్ (హీరామండి: ది డైమండ్ బజార్)
ఉత్తమ కథ (వెబ్ సిరీస్) : కోటా ఫ్యాక్టరీ సీజన్ 3
ఉత్తమ రియాల్టీ సిరీస్ : ఫ్యాబ్యులెస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్