Baahubali The Epic | టాలీవుడ్ ఐకానిక్ బ్లాక్ బస్టర్ సినిమా ‘బాహుబలి’ మళ్లీ రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 10 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. (బాహుబలి: ది ఎపిక్) BaahubaliTheEpic పేరుతో రెండు భాగాలను ఒకే పార్ట్‌గా అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటినుంచే చిత్రయూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా బాహుబలి టీమ్ ఎక్స్ వేదికగా అభిమానులను అడుగుతూ.. ఒకవేళ బాహుబలిని కట్టప్ప చంపకపోయి ఉంటే ఏం జరిగి ఉండేదంటూ పోస్ట్ పెట్టింది. దీనికి రానా రిప్లయ్ ఇస్తూ బాహుబలిని కట్టప్ప చంపకపోయి ఉంటే అతడికి బదులుగా నేను చంపేవాడిని అంటూ రానా రాసుకోచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది.
మరోవైపు బాహుబలి: ది ఎపిక్ రన్‌టైం(BaahubaliTheEpic Runtime)పై స్పందించాడు. బాహుబలి ఎంత రన్‌టైం ఉన్న నాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏడాది ఏ సినిమా చేయకుండానే రీ రిలీజ్‌తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నమోదు చేస్తాను. నాకు కూడా కరెక్ట్‌గా తెలియదు రన్‌టైం గురించి నేను కూడా సోషల్ మీడియాలో వచ్చినవి చూస్తున్నాను. కొందరూ ఏమో నాలుగు గంటలంటూ పోస్టులు పెడుతున్నారు. దీనిపై రాజమౌళి మాత్రమే క్లారిటీ ఇస్తారంటూ రానా చెప్పుకోచ్చాడు.
I would have killed him instead 😡🥂 https://t.co/8oe6qUZP9l
— Rana Daggubati (@RanaDaggubati) July 16, 2025