Idupu Kayitham | ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’ షూటింగ్‌కు రెడీ.. గ్రామీణ నేపథ్యంలో హార్ట్‌టచింగ్ కథతో రాబోతున్న చిత్రం
Idupu Kayitham | వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా, నాగదుర్గ కథానాయికగా నటిస్తున్న 'ఇడుపు కాయితం' సినిమా ప్రస్తుతం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వర్క్‌షాప్ సెషన్స్ విజయవంతంగా పూర్తయ్యాయని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Idupu Kayitham | వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా, నాగదుర్గ కథానాయికగా నటిస్తున్న ‘ఇడుపు కాయితం’ సినిమా ప్రస్తుతం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వర్క్‌షాప్ సెషన్స్ విజయవంతంగా పూర్తయ్యాయని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘ఇడుపు కాయితం’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు సుకుమార్ రైటింగ్స్ మరియు బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పల్లె జీవితంలోని భావోద్వేగాలు, బంధాలు, అనుబంధాలను ప్రతిబింబించే స్వచ్ఛమైన గ్రామీణ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.
పక్కా లోకల్ నేటివిటీకి ప్రాధాన్యం ఇస్తూ కథను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో తెలంగాణ సంస్కృతి, భాష, యాసకు ప్రత్యేక స్థానం ఉండనుంది. అందుకే తెలంగాణ నేపథ్యానికి చెందిన పలువురు నటీనటులను కీలక పాత్రల కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో, నిర్మాత బన్నీ వాస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథకు తగ్గట్టుగా హృదయాన్ని హత్తుకునే సంగీతాన్ని అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
వర్క్‌షాప్‌లు పూర్తవడంతో నటీనటులు తమ పాత్రలకు పూర్తిగా సిద్ధమయ్యారు. పాత్రల సహజత్వం, గ్రామీణ జీవనశైలిని తెరపై నిజాయితీగా ఆవిష్కరించేందుకు ఈ వర్క్‌షాప్‌లు ఉపయోగపడ్డాయని చిత్ర బృందం తెలిపింది. భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమాను ఈ ఏడాది డిసెంబర్లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రియదర్శి గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్ర బృందం ఉంది. గ్రామీణ నేపథ్యం, హృదయాన్ని హత్తుకునే కథ, బలమైన పాత్రలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

