ఏ ఇంటి కోయిలవో నువ్వు మా ఇంచి కొచ్చి..
తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న ‘ఇడుపు కాయితం’ చిత్రం నిర్మాణ దశ నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు. బన్నీ వాస్ నిర్మాత. డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది.
తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న ‘ఇడుపు కాయితం’ చిత్రం నిర్మాణ దశ నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు. బన్నీ వాస్ నిర్మాత. డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘గడప..’ అనే పాటను విడుదల చేశారు. అభినయ శ్రీనివాస్ రచించిన ఈ గీతానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్నందించారు. తేలు విజయ ఆలపించారు. ‘ఏ ఇంటి కోయిలవో నువ్వు మా ఇంటి కొచ్చి.. ప్రతి బంధాన్ని కూయాలే, నీ పట్టగొలుసుల సప్పుడు అందరికి శ్రీలత ఉన్నదనే కొత్త ధైర్యాన్ని ఇయ్యాలే’ అంటూ అత్తాగారింటి గడపలో అడుగుపెట్టే కొత్త కోడలికి ధైర్య వచనాల్ని చెబుతూ భావయుక్తంగా ఈ పాట సాగింది.
ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ.. ఈ పాటలో పుట్టింటి గడప దాటి మెట్టినింటిలో అడుగుపెట్టే ప్రతీ స్త్రీ జ్ఞాపకాలుంటాయి అని అన్నారు. ఈ పాట ప్రోమో విడుదల కాగానే తన నాన్న ఫోన్ చేసి ‘బాగా నటించావు’ అని మెచ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారని కథానాయిక నాగదుర్గ చెప్పింది. నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ ‘దర్శకుడు కథ చెప్పినప్పుడు మన ఇంట్లో జరిగే కథలా అనిపించింది. కథలోని సహజత్వమే మా అందరిని ఆకట్టుకుంది’ అన్నారు. ఈ వేదిక మీద తెలంగాణ కళాకారులందరిని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని, ఏదో తెలియని ఉద్వేగం కలుగుతున్నదని దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

