Telugu Sitcom | తెలుగు టీవీ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిన కామెడీ సిట్కామ్ ‘అమృతం’ ప్రసారమై నేటితో 24 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ సీరియల్ జ్ఞాపకాలను పంచుకుంటూ పోస్టులతో సందడి చేస్తున్నారు. 2001 నవంబర్ 18న జెమిని టీవీలో ప్రారంభమైన ఈ సిట్కామ్ 2007 నవంబర్ 18 వరకు విజయవంతంగా ప్రసారమైంది. ఆరు సంవత్సరాలలో దాదాపు 313 ఎపిసోడ్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ‘అమృతం’ కేవలం కామెడీ సీరియల్ మాత్రమే కాదు మధ్య తరగతి జీవితంలోని సమస్యలు, ఆశలు, నిరాశలను హాస్యం రూపంలో అద్దం పట్టించింది. ప్రముఖ నిర్మాత, రచయిత గుణ్ణం గంగరాజు ఈ హాస్య ధారావాహికను సృష్టించి, నిర్మించగా.. అమృతం పాత్రలో శివాజీ రాజా, నరేష్, హర్షవర్థన్ కాలానికి అనుగుణంగా నటించారు. అంజి పాత్రలో గుండు హనుమంతురావు నటించగా.. సర్వం పాత్రలో వాసు ఇంటూరి, అప్పాజీ పాత్రలో శివన్నారాయణ నరిపెద్ది నటించి మెప్పించారు.
24 Beautiful Years ✨ pic.twitter.com/DkBGg3yjKl
— Surya Strange (@SuryaStrange) November 18, 2025
24 years for Amrutham ❣️ CLASSIC.
Edit by @Telugumantw pic.twitter.com/61GjEvGf7c
— Incognito Telugu (@IncognitoTelugu) November 18, 2025
For 24 years, this #Amrutham has been the place I return to whenever life gets heavy — a show that aged, but never grew old.
TELUGU PEOPLES MOST FAVOURITE SITCOM #24YearsforAmrutham ❤️ pic.twitter.com/i9NkUE6E8l
— Srinivas Bandi || OG 💥 (@srinubandi4444) November 18, 2025