హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మరికాసేపట్లో సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు దవాఖానకు వెళ్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఈ ఘటనలో బాలుని తల్లి రేవతి మృతిచెందిన విషయం తెలిసిందే.
కాగా, కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ రామ్‌గోపాల్‌పేట పోలీసులు ఐకాన్ స్టార్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు కిమ్స్ దవాఖానకు ఎప్పుడు వెళ్లినా.. తమకు ముందుగానే సమాచారం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ముందుస్తు సమాచారం ఇస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అల్లు అర్జున్ వచ్చే విషయం కూడా రహస్యంగా ఉంచాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ తమకు సమాచారం ఇవ్వకుడా హాస్పిటల్‌కి వస్తే పూర్తి బాధ్యత మీదేనంటూ నోటీసుల్లో స్పష్టం చేశారు. కాగా.. రెగ్యూలర్ బెయిల్ వచ్చిన నేపథ్యంలో శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళ్తారన్న ప్రచారం జరగటంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు.