Actor Allu Arjun | మెగాస్టార్ కుటుంబంలోకి లిటిల్ ప్రిన్సెస్ రాకతో సంబురాలు అంబరాన్నంటాయి. రామ్‌చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో అపోలో హాస్పిటల్ దగ్గర మెగా సందడి నెలకొంది. మెగా ప్రిన్సెస్ వచ్చిందంటూ ఆస్పత్రి చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హాస్పిటల్ వద్ద సిబ్బంది ఫ్యాన్స్ కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు. ఇక మెగా ప్రిన్సెస్‌ను చూడటానికి చిరంజీవి సహా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా హాస్పిటల్ వద్దకు చేరుకుంటున్నారు.
తాజాగా పుష్పరాజ్ అల్లుఅర్జున్, స్నేహా రెడ్డిలు మెగా ప్రిన్సెస్‌ను చూడటానికి హాస్పిటల్‌కు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక పలువురు తారలు చరణ్, ఉపాసనలకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లిటిల్ మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం అంటూ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశాడు. పేరెంట్స్ క్లబ్‌లోకి స్వాగతం. ఆడబిడ్డతో గడిపే ప్రతీ క్షణం జీవితాంతం మర్చిపోలేము. ఆ దేవుడి ఆశీస్సులతో పాప, మీరుఎ ఆనందంగా ఉండాలి అంటూ ట్వీట్ చేశాడు. ఇక పెళ్ళైన పదకొండేళ్ల తర్వాత రామ్‌చరణ్, ఉపాసన తల్లిదండ్రులయ్యారు.
BunnySneha arrived at Apollo hospital….#MegaPrincess ❤️ #AlluArjun𓃵 #AlluSnehaReddy pic.twitter.com/obg3j5oX3c
— Bunny_boy_private (@Bunnyboiprivate) June 20, 2023