Abhimanyu Singh | బాడీగార్డ్, గబ్బర్ సింగ్, జై లవకుశ, పండగ చేస్కో, ఆక్సిజన్ సినిమాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు బీహారీ యాక్టర్ అభిమన్యు సింగ్ (Abhimanyu Singh). హిందీ, తమిళం, కన్నడ, గుజరాతీ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ చాలా రోజుల తర్వాత మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్లో నటిస్తున్న దేవర (Devara)లో కీ రోల్ పోషిస్తున్నాడు. తారక్‌తో మరోసారి పనిచేస్తుండటంతో తన ఎక్జయిట్‌మెంట్‌ను అందరితో పంచుకున్నాడు అభిమన్యు సింగ్.
ఇప్పటివరకు ఇది గొప్ప అనుభవం. తారక్‌తో కలిసి పనిచేయడం చాలా ఇష్టం. తారక్ హోమ్ ప్రొడక్షన్ కోసం.. యాక్షన్ సీక్వెన్స్, తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరిగింది. మేమిద్దరం కలిసి పని చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు జైలవకుశలో కలిసి పని చేశాం. త్వరలో విడుదల కానున్న దేవర సినిమాపై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అని నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు అభిమన్యు సింగ్ .
టాలీవుడ్ సినీ జనాలతోపాటు గ్లోబల్ మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం దేవర. జనతా గారేజ్ తర్వాత కొరటాల శివ (Siva Koratala) డైరెక్షన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరిగే స్టోరీతో రాబోతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రంలో పాపులర్ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవర ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి పాపులర్ టెక్నీషియన్ రత్నవేల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
#Devara 5th shedule has completed yesterday 👍
And the next shedule will start from this 18th a action sequence will be filmed in this shedule under Solmon master choreography in the sets of shamshabad ❤️🔥🔥#ManofMassesNTR #Devara pic.twitter.com/Eexf2yU7w2
— Devara (@Devara_ntr) July 16, 2023
దేవర ఫస్ట్ లుక్..
#Devara pic.twitter.com/bUrmfh46sR
— Jr NTR (@tarak9999) May 19, 2023