ముంబై: రాజ్‌కుంద్రా పోర్న్ వీడియోల కేసులు అతని భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి( Shilpa Shetty )ని కూడా సాక్షిగా చార్జ్‌షీట్‌లో చేర్చారు ముంబై పోలీసులు. దీనిపై ఆమె స్టేట్మెంట్ను కూడా రికార్డు చేశారు. అయితే తాను తన వర్క్‌లో చాలా బిజీగా ఉండేదాన్నని, రాజ్‌కుంద్రా ఏం చేస్తుండేవాడో తాను ఎప్పుడూ పట్టించుకోలేదని శిల్పా పోలీసులకు చెప్పడం విశేషం. ఈ కేసులో ముంబై పోలీసులు 1400 పేజీల చార్జ్‌షీట్‌ను ఫైల్ చేశారు. తనకు హాట్‌షాట్స్, బాలీఫేమ్ యాప్స్ గురించి కూడా తెలియదని శిల్పా చెప్పినట్లు చార్జ్‌షీట్‌లో పోలీసులు వెల్లడించారు.
ఈ పోర్న్ కేసు బయటపడిన తర్వాత హాట్‌షాట్స్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించిన తర్వాత.. బాలీఫేమ్ యాప్ కొత్తగా కనిపించింది. ఈ పోర్న్ రాకెట్‌ను నడిపించడానికి రాజ్‌కుంద్రా.. వియాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిసరాలను ఉపయోగించుకున్నట్లు చార్జ్‌షీట్‌లో చెప్పారు. ఈ పోర్న్రాకెట్ కేసులో జులై 19న పోలీసులు రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేశారు. అయితే అది పోర్న్ కాదంటూ కోర్టులో రాజ్‌కుంద్రా వాదిస్తున్నాడు.