Malvika Nair Interview | క్యూట్ లుక్, చబ్బీ యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసే భామల్లో ముందు వరుసలో ఉంటుంది మాళవికా నాయర్ (Malvika Nair). ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ భామ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule). సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ చేసి.. సినిమా విశేషాలను అందరితో పంచుకుంది మాళవికా నాయర్. సినిమా విశేషాలు మాళవికా మాటల్లోనే..
సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది..?
నా రోల్ ఇదివరకు చేసిన అన్ని పాత్రల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సినిమాలో నా పాత్ర చాలా ఆర్గనైజ్డ్గా కోపం, ధైర్యం చూపించేందుకు వెనుకాడకుండా ఉంటుంది. సినిమాలో ప్రతీ దాంట్లో నియంత్రణ కలిగి ఉండేందుకు ప్రయత్నిస్తుంది.
మీ పాత్ర రియల్‌లైఫ్‌లో ఎవరినైనా పోలి ఉంటుందా..?
ఎవడే సుబ్రహ్మణ్యంలో నా పాత్ర ప్రియాంక గారితో సారుప్యత కలిగి ఉంటుంది. కానీ స్వప్న ఆర్గనైజింగ్ లీడర్. కాబట్టి ఇందులో నా రోల్ సప్న గారిని పోలి ఉంటుంది.
మీ పాత్ర కోసం నందినీ రెడ్డి నుంచి ఎలాంటి ఇన్పుట్స్ తీసుకున్నారు..?
నందినీరెడ్డి నాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. ఆమె విజన్‌ను నాతో పంచుకున్నారు. దర్శకుల విజన్‌ను అర్థం చేసుకొని ప్రేక్షకులు ఇష్టపడేలా నటించడం యాక్టర్ల బాధ్యత. సినిమాలో నా పాత్రకు కామెడీ టచ్ కూడా ఉంటుంది.
అన్నీ మంచి శకునములే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి..?
ఎక్కువ భాగంగా కునూర్ హిల్ స్టేషన్లో షూట్ చేశాం. అక్కడే 30 రోజుల దాకా ఉన్నాం. రాజేంద్రప్రసాద్, గౌతమి, నరేశ్, వాసుకి లాంటి యాక్టర్లతో పనిచేయడం మధురమైన అనుభూతిని అందించింది. మేము సినిమాల గురించే కాకుండా ఇతర విషయాలు కూడా మాట్లాడుకునేవాళ్లం.
ఈ సినిమాలో నటించడానికి కారణం..?
నందినీరెడ్డితో మళ్లీ పనిచేయాలనుంది. వైజయంతీ ఫిలిమ్స్ స్వప్న, ప్రియాంక తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. వారి క్రియేటివ్ ఇన్పుట్స్ అద్భుతం. పిల్లలను తల్లిదండ్రులు సపోర్ట్ చేసినట్టే.. వీళ్లు కూడా యాక్టర్లకు మద్దతుగా నిలుస్తారు.
నటిగా మీ లక్ష్యం ఏంటీ..?
నాకు ఓ యాక్షన్ సినిమా చేయాలనుంది. యాక్షన్ సినిమా చేయడమంటే నాకు చాలా చాలా ఇష్టం.
కొత్త ప్రాజెక్టుల గురించి..?
కల్యాణ్ రామ్‌తో కలిసి నటిస్తున్న డెవిల్ చిత్రంలో చాలా ఇంట్రెస్టింగ్, ఎక్జయిటింగ్ పాత్ర చేస్తున్నా.