‘ప్రేమలు’ చిత్రంతో దక్షిణాది పరిశ్రమను ఒక్కసారిగా ఆకర్షించింది మలయాళీ సోయగం మమితా బైజు. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తమిళంలో సీఎం విజయ్‌తో కలిసి నటించిన ‘జన నాయగన్’ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తెలుగులో సూర్య సరసన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలో నటిస్తున్నది. ఇలా ఈ ముద్దుగుమ్మ సినిమాల లైనప్ భారీగానే ఉంది.
అనతికాలంలో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకోవడం ఆనందంగా ఉందని, నటిగా తాను నిర్ధిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకున్నానని చెబుతున్నది మమితా బైజు. ‘ఉత్తమ కథా చిత్రాల్ని ఎంచుకొని సవాళ్లతో కూడిన పాత్రలు చేయాలనుంది. నన్ను ఎప్పటికీ ఇష్టపడేలా అభిమానుల ప్రేమను పొందాలి. ఇండస్ట్రీ నుంచి రిటైర్ అయ్యాక గడచిపోయిన రోజులు గుర్తుకువస్తే హృదయం ఆనందంతో నిండిపోవాలి. నటిగా కలకాలం గుర్తుండిపోవాలి. అదే నా లక్ష్యం’ అని చెప్పుకొచ్చింది మమితాబైజు.