Custody | అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ కస్టడీ (Custody). వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో, టీజర్, ట్రైలర్ ఛేజింగ్, యాక్షన్ సన్నివేశాలతో సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో NC 22గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మే 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాగచైతన్య సినిమా విశేషాలు మీడియాతో పంచుకున్నాడు. కస్టడీ గురించి ఆసక్తికర విషయాలు చైతూ మాటల్లోనే..
కస్టడీలో ఎక్కువగా నచ్చిన అంశం..
నేను కానిస్టేబుల్‌గా నటిస్తున్నా. అండర్డాగ్ లాంటి పాత్ర. పర్ఫార్మెన్స్కు చాలా స్కోప్ ఉన్న రోల్. నా కారెక్టర్‌ను డిజైన్ చేసి. ప్రొజెక్ట్ చేసిన విధానాన్ని చాలా ఎంజాయ్ చేశా. ప్రేక్షకులు సినిమా చూశాక చాలా గొప్పగా ఫీలవుతారు.
ఫైట్ మాస్టర్స్‌తో ఏం విషయాలు చర్చించేవారు..?
చాలా విషయాలు చర్చించేవాడిని. చాలా రిహార్సల్స్ కూడా చేశాను. యాక్షన్ పార్ట్ వీలైనంత రియలిస్టిక్‌గా ఉండేలా ప్రయత్నించాం. హై స్పీడ్ షాట్స్‌తో ఉండే సినిమాలంటే నాకిష్టం. జనాలు గాల్లో ఎగురుతుంటారు.. కార్లు పైకి లేస్తుంటాయి. కానీ కస్టడీలో నేనలాంటి సీన్లు చేస్తే సిల్లీగా ఉంటాయి.
అండర్ డాగ్ క్యారెక్టర్‌కు మీ ఇమేజ్ ఎలా సరిపోయింది..?
ఇమేజ్‌తో ఎలాంటి సంబంధం లేదు. సెకండాఫ్‌లో అతని (కానిస్టేబుల్) ఎదుగుదల చూస్తే.. ప్రేక్షకులు చాలా థ్రిల్ అవడమే కాకుండా ఎంజాయ్ చేస్తారు. చాలా సహజసిద్దంగా నా పాత్రను చూపించడం జరిగింది.
తమిళంలో తొలి సారి డబ్బింగ్ చెప్పడం ఎలా ఉంది..?
ఇది చాలా ఛాలెంజింగ్ లాంటిది. తెలుగు డబ్బింగ్‌కు వారం నుంచి పది రోజుల సమయం తీసుకున్నా. కానీ తమిళంలో మాత్రం డబ్బింగ్ పూర్తి చేసేందుకు నెల పట్టింది. తమిళంలో ఖచ్చితంగా నేను డబ్బింగ్ చెప్పుకోవాలని డైరెక్టర్ చెప్పారు. ఓ యాక్టర్ తనకు తాను డబ్బింగ్ చెప్పుకుంటే పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు చాలా బాగా చేరుతుందన్నాడు.
కస్టడీ నిర్మాతతో ఉన్న అనుబంధం గురించి..
శ్రీనివాస్ ఎప్పుడూ ఓ మంచి స్నేహితుడిలా, కుటుంబ సభ్యుడిలా కలిసిపోతారు. మా మధ్య ఎప్పుడూ ఓపెన్ డిస్కషన్ ఉంటుంది. అలాంటి నిర్మాతలంటే ఇష్టం. కథ చాలా బాగా నచ్చడంతో.. ఆయన చాలా మక్కువతో సినిమా తీశారు.
ఏ దశలో సినిమా ఫెయిల్ అవుతుందంటారు..?
స్క్రిప్ట్ దశలోనే సినిమా ఫెయిల్యూర్ అవుతుందని అనుకుంటున్నా. సాధారణంగా జనాలు స్క్రిప్ట్ దశలో తమ జడ్జిమెంట్‌ను తప్పు పట్టొచ్చు. ఒకవేళ స్క్రిఫ్ట్ బాగుంటే అది సినిమా అవుట్ పుట్ మీద ప్రభావం చూపేలా ఎక్స్‌క్యూషన్ ఉండాలి. అంతకు మించి వేరే స్టేజీలో సినిమా ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు.
మీకు అండర్డాగ్ క్యారెక్టర్ చేయాలన్న ఆసక్తి ఎందుకు..?
కస్టడీ గురించి చెప్పాలంటే.. అదొక చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. నాకు వాస్తవానికి దగ్గరగా ఉన్న పాత్రలు చాలా నచ్చుతాయి. మీరు లవ్‌స్టోరీ సినిమాను పరిశీలిస్తే.. సాధారణ సమస్యల చుట్టూ పాత్రే ఉంటుంది. అలాంటి సమస్యలపై అవగాహన కల్పించాలన్నదే నా ఆలోచన.
అండర్ వాటర్ సీక్వెన్స్ మేకింగ్ వీడియో..
కస్టడీ గ్లింప్స్ వీడియో..
Timeless Love లిరికల్ వీడియో సాంగ్..
హెడ్ అప్ హై లిరికల్ వీడియో సాంగ్..
స్టడీ గ్లింప్స్ వీడియో..
నాగచైతన్య కస్టడీ టీజర్ టీజ్..
కస్టడీ టీజర్..