R Madhavan Son | నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 20 ఏళ్ల ఫ్రీస్టైల్ స్విమ్మర్ అయిన వేదాంత్ తన కెరీర్ కోసం భారత్‌లోని జీవితాన్ని వదులుకుని దుబాయ్‌కు వెళ్లినట్లు చెప్పాడు. కోవిడ్-19 సమయంలో భారత్‌లో స్విమ్మింగ్ పూల్స్ మూతపడటంతో 2020లో వేదాంత్ కుటుంబంతో సహా దుబాయ్‌కు మకాం మార్చాడు.
ఆ మార్పు గురించి వేదాంత్ తాజాగా మాట్లాడుతూ.. షిఫ్ట్ అయితే మంచిగానే జరిగింది. మా ఆస్తులన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. కానీ నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం మాత్రం నాకు షాక్లాగే అనిపించింది. పుట్టినప్పటి నుంచి భారత్‌లోనే ఉన్నాను. కొత్త దేశానికి, కొత్త స్కూల్ లైఫ్‌కు అలవాటు పడటం, అదే సమయంలో స్విమ్మింగ్, సోషల్ లైఫ్ మేనేజ్ చేయడం కాస్త కష్టమైంది అని వేదాంత్ అన్నారు. కోవిడ్ పరిస్థితుల్లో దుబాయ్‌కు రావడం నా కెరీర్‌కు మంచి నిర్ణయమే. దానివల్లే నేను డెన్మార్క్‌లో రేస్ చేయగలిగాను.
భారత్‌లో నా ఫ్రెండ్స్‌తో ఉన్న జీవితాన్ని, నాకున్న వాతావరణాన్ని త్యాగం చేశాను. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, కొత్త దేశంలో నాకు నచ్చిన పని చేయగలుగుతున్నాను అని వేదాంత్ తెలిపాడు. ఇక తల్లిదండ్రుల మద్దతుపై వేదాంత్ మాట్లాడుతూ.. మా అమ్మానాన్నలు నాకు చాలా సపోర్టివ్. కలలను సపోర్ట్ చేసే తల్లిదండ్రులు అందరికీ ఉండరు. ఆ విషయంలో నేను చాలా లక్కీ. వాళ్లు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. స్విమ్మింగ్‌లో పేరెంట్స్ కూడా టీమ్‌లో భాగమే. వారి సపోర్ట్ లేకపోతే ఏదీ సరిగ్గా సాగదు అని వేదాంత్ చెప్పుకోచ్చాడు. మాధవన్, సరితా బిర్జే 1999లో వివాహం చేసుకున్నారు. ఎనిమిదేళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్న వీరికి 2005లో వేదాంత్ జన్మించాడు. ఇక సినిమాల విషయానికి వస్తే, మాధవన్ ఈ ఏడాది ‘ధురంధర్ 2’ చిత్రంలో కనిపించారు. వచ్చే వారం రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకోనున్నారు.