Kalyani Malik | సరిగా ఆడని సినిమాలకు కూడా ప్రశంసలు అందుకున్నా.. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ చిట్‌చాట్
నాగశౌర్య (Naga Shaurya) నటిస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (Phalana Abbayi Phalana Ammayi). ఈ మూవీ మార్చి 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ (Kalyani Malik) మీడియాతో చిట్ చాట్ చేశాడు.
టాలీవుడ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (Phalana Abbayi Phalana Ammayi). రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. కళ్యాణి మాలిక్ కంపోజిషన్‌లో విడుదలైన పాటలు ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ మార్చి 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ (Kalyani Malik) తన మ్యూజికల్ జర్నీ విశేషాలు మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో పంచుకున్నాడు.
అద్భుతమైన పాటలు కంపోజ్ చేశాక కూడా సక్సెస్ రాకపోవడానికి కారణం..?
ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేను. నా కెరీర్, జీవితం నా ప్లాన్ ప్రకారం సాగలేదు. నా పనిపై మాత్రమే శ్రద్ద పెట్టాను. కస్టమర్ (ప్రేక్షకుడు) సంతృప్తి చెందారా..? లేదా అన్నదే నాకు ముఖ్యం. నా పని పట్ల నా దర్శకులు సంతృప్తి చెందారా..? అనేది నిర్ధారించుకుంటా. ఈ మార్చి నాటికి ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నా. కెరీర్లో చాలా ఎత్తుపల్లాలు చూశాను. సరిగా ఆడని సినిమాలకు కూడా మంచి ప్రశంసలు అందుకున్నా.
శ్రీనివాస్ అవసరాలతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్..
శ్రీనివాస్ అవసరాలతో పనిచేయడం అద్భుతంగా ఉంటుంది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాకు మొదటి చాయిస్ నేను కాదు. ఒక పాట వివేక్ సాగర్ కంపోజ్ చేశారు. మిగిలిన పాటలు నేను చేశా. శ్రీనివాస్ అవసరాల, వివేక్ కలిసి నా దగ్గరకు వచ్చారు. ఈ ప్రాజెక్ట్‌లో పనిచేసే అవకాశం రావడం అద్బుతంగా భావిస్తున్నా.
సింగర్‌గా మీ ప్రయాణంపై కామెంట్..
ప్రేక్షకులు నన్ను పాటలు పాడాలని అడుగరనుకుంటున్నా. ఏం సందేహం (ఊహలు గుసగుసలాడే) లేదు పాటకు సునీత అవార్డు అందుకున్నారు. కానీ నాకెలాంటి అవార్డు రాకపోడం నిరాశ కలిగించింది. చాలా అసంతృప్తికి లోనయ్యాను. కానీ నేను ముందుగా చెప్పినట్టుగా నా కెరీర్ ప్రయాణం కొనసాగుతుంది.
ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండటం గురించి..
నా పనికి ట్విట్టర్లో ప్రశంసలు వస్తుండటం సంతోషంగా ఉంది. ఈ ప్లాట్‌ఫాంలో ఆహారం గురించి కూడా షేర్ చేస్తుంటా. కొన్ని సార్లు ఇతర సంగీత దర్శకులు కంపోజ్ చేసిన పాటలు షేర్ చేస్తుంటా. ఆన్లైన్ ట్రోలింగ్ నుంచి తప్పించుకునేందుకు డిఫరెంట్ యూజర్ నేమ్స్ వాడుతుంటా.
భవిష్యత్‌లో ఎస్ఎస్ రాజమౌళి సినిమాకు పనిచేస్తారనుకుంటున్నారా..?
ఎస్ఎస్ రాజమౌళి ఎప్పుడూ తన సినిమాలకు ఎంఎం కీరవాణిని ఎంపిక చేసుకుంటారు. రీప్లేస్‌మెంట్‌కు అవకాశమే లేదు. సుకుమార్-దేవీ శ్రీ ప్రసాద్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. వాళ్లు సరైన కాంబినేషన్. నేను రాజమౌళితో పనిచేస్తానని అనుకోవడం లేదు.
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

