Cinema News | విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ఈ సినిమా నుంచి ‘ఓ పిల్లా..’ అంటూ సాగే రెండో గీతాన్ని విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ స్వరాలను సమకూర్చిన ఈ పాటను కృష్ణచైతన్య రాయగా.. నకాష్ అజీజ్ ఆలపించారు.
‘ఓ పిల్లో..బీటెక్‌లో మిస్సయ్యానే నిన్నే కొంచెంలో.. ఇవాళో, రేపట్లో నిన్నైతే సెట్ చేస్తానే తొందర్లో..’ అంటూ రొమాంటిక్ గీతంగా మెప్పిస్తున్నది. విశ్వక్సేన్, మీనాక్షి చౌదరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. కాలేజీ రోజుల్లో తాను ఇష్టపడిన అమ్మాయిని హీరో చాలా ఏళ్ల తర్వాత కలుసుకుంటాడు. ఆ సమయంలో అతని మదిలోని భావాలను ఆవిష్కరిస్తూ ఈ పాటను రూపొందించామని దర్శకుడు తెలిపారు. శ్రద్ధాశ్రీనాథ్, నరేష్, వైవా హర్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, రచన-దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి.