Sankranthiki Vasthunam | విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కథానాయకుడిగా వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా.. కేవలం 10 రోజుల్లోనే రూ.230 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా కథకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న అనిల్ మాట్లాడుతూ.. రజనీకాంత్ జైలర్ సినిమా చూసి మహేశ్ బాబు నాకు కాల్ చేశాడు. దాదాపు 45 నిమిషాలు మాట్లాడాడు. నువ్వు కూడా ఇలాంటి డార్క్ కామెడీ సినిమాలు తీయమన్నాడు. నీకు ఆ సత్తా ఉంది. మీరు దాన్ని వాడుకోండి. ఆయన సలహాతోనే ఈ సినిమాకు బీజం పడింది. అక్కడనుంచే సంక్రాంతికి వస్తున్నాం మొదలైంది. అంటూ అనిల్ రావిపూడి చెప్పుకోచ్చాడు.