Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్ (Captain Miller). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మలయాళ నటుడు సుమేశ్ మూర్ (Sumesh Moor) కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే సినిమా ఎలా ఉండబోతుందో.. హింట్ ఇచ్చాడు.
‘మనందరికీ ఈ సినిమా అద్బుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించడం ఖాయమని ఖచ్చితంగా చెప్పగలను. మానిటర్లో క్యాప్చర్ చేసిన కొన్ని సన్నివేశాలు చూసే అవకాశమొచ్చింది. ఆ సన్నివేశాలు చూసి నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చేశాయంటూ చెప్పుకొచ్చాడు’ మూర్ .
మొత్తానికి ధనుష్‌ను ఇదివరకెన్నడూ చూడని అవతార్‌లో చూడబోతున్నట్టు తాజా అప్డేట్తో క్లారిటీ రావడంతో.. అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్, సందీప్ కిషన్, నివేదితా సతీశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ థ్రిల్లర్‌గా వస్తున్న కెప్టెన్ మిల్లర్‌లో అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ (Edward Sonnenblick) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఎడ్వర్డ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంఛ్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని తమిళ అగ్ర చిత్ర నిర్మాత సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తుంది.
పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ధనుష్ సినిమాలంటే తమిళం, తెలుగుతోపాటు వివిధ భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ఈ సారి కెప్టెన్ మిల్లర్‌గా పాన్ ఇండియా మార్కెట్లో ఎలాంటి ట్రెండ్ సృష్టిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
#CaptainMiller – I am damn sure that this film will be an awesome cinematic experience for all of us..⭐
• I got a chance to watch some of the visuals that were captured on the monitor, I literally got goosebumps..🔥
: Actor Moor pic.twitter.com/rErqjv55ed
— Laxmi Kanth (@iammoviebuff007) May 7, 2023
We welcome the talented ” #RRR ” fame American actor @trulyedward on board for #CaptainMiller 🥁💥@dhanushkraja @ArunMatheswaran @NimmaShivanna @sundeepkishan @gvprakash @priyankaamohan @highonkokken @nivedhithaa_Sat pic.twitter.com/gUi5jX0R8O
— Sathya Jyothi Films (@SathyaJyothi) April 22, 2023
We are very elated to present #CaptainMiller with the indomitable star @dhanushkraja 💫
This will be a very exciting film DIRECTED by the young & maverick @ArunMatheswaran 🔥🤗
A @gvprakash Musical 🥁 pic.twitter.com/FKX2iPL1yr
— Sathya Jyothi Films (@SathyaJyothi) July 2, 2022