‘న్యూ టాలెంట్‌ని ప్రోత్సహించేందుకు ‘దిల్‌రాజు డ్రీమ్స్’ను స్థాపించాను. దర్శక, నిర్మాతలు, హీరోహీరోయిన్లు, రచయితలు ఇలా ఎవ్వరైనా సరే ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు, మా టీమ్‌ను అప్రోజ్ అవ్వొచ్చు. దీనికో సం ఓ వెబ్‌సైట్‌ను కూడా లాంచ్ చేస్తున్నాం. ఆ వెబ్సైట్ ద్వారా మీ కంటెంట్ మా టీమ్‌కు చేరుతుంది. వాటిని వడపోసి, మా టీమ్ కొన్ని కథల్ని సెలక్ట్ చేస్తుంది. వారంలో ఒకరోజు ఆ కథలు నేను వింటాను’ అని దిల్ రాజు చెప్పారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే సదుద్దేశ్యంతో నిర్మాత దిల్‌రాజు తన పేరిట ‘దిల్‌రాజు డ్రీమ్స్’ అనే సంస్థను స్థాపించారు. సోమవారం దీని లోగోని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మీడియాతో మాట్లాడుతూ ‘ఇప్పటికే ఇద్దరు ఎన్నారై నిర్మాతలు దిల్‌రాజు డ్రీమ్స్ ద్వారా రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు. స్క్రిప్ట్ స్థాయిలోనే మీడియా వాళ్ల సహాయం కూడా తీసుకోవాలనుకుంటున్నాం. సినిమాను ఎలా గూ రివ్యూ చేస్తారు. దానికంటే ముందు ఇలా స్క్రిప్ట్‌ని కూడా రివ్యూ చేసేందుకు మా టీమ్‌లోకి మీడియాని ఆహ్వానిస్తున్నాం.’ అన్నారు.