సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరరావు కొంత విరామం తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘దోచేవారెవరురా’. ప్రణవ్చంద్ర, మాళవిక సతీషన్, అజయ్‌ఘోష్, ప్రణతి మనసుపలికే, బిత్తిరి సత్తి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి బొడ్డు కొటేశ్వరరావు నిర్మాత. ఇటీవల ఈ చిత్రంలోని ‘కల్లాసు అన్ని వర్రీసూ.. నువ్వేలే.. నీబాసూ’ పాటను గుంటూరు మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మలినేని పెరుమాళ్లు గారి చేతుల మీదుగా విడుదల చేశారు.
మహిళల స్వేచ్ఛ గురించి చిత్రంలో వచ్చే ఈ పాటకు కాలేజీలో విడుదల చేయడం ఆనందంగా వుంది. కామెడీ థ్రిల్లర్‌గా పూర్తి వినోదభరితంగా చిత్రం ఉంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు.