Gaddar | నేను స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి గద్దరన్నతో పరిచయం ఉంది : ఎన్ శంకర్
Gaddar | ప్రజాయుద్ధనౌక గద్దర్ (Gaddar) మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎన్ శంకర్ డైరెక్ట్ చేసిన చిత్రం జై బోలో తెలంగాణ (Jai Bolo Telangana) సినిమాలో గద్దర్ (Gaddar) రాసిన పొడుస్తున్న పొద్దు మీద పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ సాగే పాట కోట్లాది మందిలో ఉత్తేజాన్ని నింపింది.
Gaddar | కవిగా, విప్లవకారుడిగా, గాయకుడిగా కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్ (Gaddar). ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 2011లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఎన్ శంకర్ డైరెక్ట్ చేసిన చిత్రం జై బోలో తెలంగాణ (Jai Bolo Telangana). ఈ సినిమాలో గద్దర్ (Gaddar) రాసిన పొడుస్తున్న పొద్దు మీద పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ సాగే పాట కోట్లాది మందిలో ఉత్తేజాన్ని నింపింది. గద్దర్ ఈ పాటను పాడటమే కాకుండా నటించారు కూడా.
గద్దర్ మృతి పట్ల ఎన్ శంకర్ (N shankar) మీడియాతో మాట్లాడుతూ.. గద్దరన్న లేరన్న వార్త చూసి షాకయ్యానన్నారు. మూడు రోజుల క్రితం సర్జరీ బాగా జరిగిందని తెలిసి సంతోషించాను. కానీ ఇప్పుడు ఆయన లేరన్న వార్త విని షాకయ్యా. 1983లో నేను స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది. ఆ తర్వాత మా కాలేజీలో ఓ కార్యక్రమానికి గద్దరన్నను తీసుకెళ్లా. అటు నుంచి నేను సినిమాల్లోకి వెళ్లా. అనంతరం వీలైనప్పుడల్లా కలిసేవాళ్లం. ఎన్కౌంటర్, శ్రీరాములయ్య సినిమాల టైంలో ఆయన ఫీడ్ బ్యాక్ ఇచ్చేవారు.
మహాత్మా జ్యోతిరావు పూలే కాన్సెప్ట్‌ను తీసుకుని జయం మనదేరా సినిమా చేస్తున్నానని తెలుసుకుని, ఇంతవరకు ఈ దేశంలో ఎవరూ చెప్పే ప్రయత్నం చేయలేదని చాలా సంతోషించారు. జై బోలో తెలంగాణ చిత్రంలో ఓ కీలక సన్నివేశంలో పాట కావాలి, మీరు పాడితే బాగుంటదని అడిగినప్పుడు.. ఆయనే పాట రాసి, పాడి, నటించి సినిమాకు, తెలంగాణ ఉద్యమానికి, ప్రేక్షకులకు ఉద్యమం పట్ల ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చిన గద్దరన్న మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ శంకర్.
పొడుస్తున్న పొద్దు మీద సాంగ్..
బండెనక బండి కట్టి సాంగ్..
మేలుకో రైతన్న సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
Rahul Gandhi: దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

