సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పీ హీరో హీరోయిన్లుగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘గాలోడు’. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల రూపొందించారు. ఈ సినిమాకు ఆదరణ దక్కుతున్నదని దర్శకుడు రాజశేఖర్ రెడ్డి చెబుతున్నారు. ఇటీవల జరిగిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కథ కాబట్టి ఈ చిత్ర విజయాన్ని ముందే ఊహించాను.
మాస్ ఆడియెన్స్‌కు సినిమా బాగా నచ్చిందని చెబుతున్నారు. సినిమా విడుదలైన ప్రతి చోటా బాగుందనే స్పందన వస్తున్నది. కథ నెమ్మదించిన చోట సంభాషణలు బాగుండేలా చూసుకున్నాను. గాలోడి పాత్రలో సుధీర్ నటన ఆకట్టుకుంటున్నది. పాటలు, డైలాగ్స్‌కు థియేటర్లో రెస్పాన్స్ బాగుంది. ఇప్పటిదాకా బౌండ్ స్క్రిప్ట్స్ ఉండటంతో వెనువెంటనే సినిమాలు చేశాను. ప్రస్తుతం కాస్త సమయం తీసుకుని కొత్త చిత్రాన్ని ప్రకటిస్తా. గజ్జెల గుర్రం అనే సబ్జెక్ట్ రెడీగా ఉంది’ అని చెప్పారు.