కార్తీక్‌రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ యు’. అంజి రామ్ దర్శకుడు. శ్రీగాయత్రి ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగరాజ్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ ‘లవ్ సైకాలజీని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.
ప్రేమలోని కొత్త కోణాన్ని తెలియజేస్తుంది. ప్రేమకథా చిత్రాల్లో సరికొత్త పంథాలో తెరకెక్కించాం. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.మురళీమోహన్ రెడ్డి, సంగీతం: సాకార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అంజి రామ్.