Vishwak Sen | విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకుడు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ఈ సినిమా నుంచి ‘ఐ హేట్ యూ మై డాడీ’ అనే పాటను విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ స్వరపరచిన ఈ పాటను సనారే రచించారు.
రామ్ మిరియాల ఆలపించారు. తండ్రీకొడుకుల మధ్య వుండే ప్రేమానుబంధాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట అర్థవంతంగా సాగింది. విశ్వక్సేన్ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ ఇదని, విశ్వక్సేన్ పాత్ర గత సినిమాలకు భిన్నంగా ఉంటుందని, వినోదానికి పెద్దపీట వేశామని చిత్రబృందం పేర్కొంది. మీనాక్షి చౌదరి, శ్రద్ధాశ్రీనాథ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ కటసాని, సంగీతం: జేక్స్ బిజోయ్, రచన-దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి.