Chiranjeevi | ప్రేక్షకుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను..చిరంజీవి ట్వీట్ వైరల్
చిరంజీవికి, ఆయన అభిమానులకు సెప్టెంబర్ 22 ప్రత్యేకమైన రోజు .స్పెషల్ ఏంటంటే చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చి 44 వసంతాలు (44 years)పూర్తి చేసుకున్నాడు.
చిరంజీవి (Chiranjeevi) త్వరలోనే గాడ్ ఫాదర్ (God Father)తో అభిమానులకు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికిమోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే థార్ మార్ థక్కర్ మార్ సాంగ్‌ను విడుదల చేసి మూవీ లవర్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు చిరు. కాగా చిరంజీవికి, ఆయన అభిమానులకు ప్రత్యేకమైన రోజు సెప్టెంబర్ 22.
స్పెషల్ ఏంటంటే చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చి 44 వసంతాలు (44 years)పూర్తి చేసుకున్నాడు. చిరు తొలిసినిమా ప్రాణం ఖరీదు 44 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు విడుదలైంది. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ..భావోద్వేగపూరిత సందేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు చిరు. తెలుగు సినీ పరిశ్రమ (Telugu Cinema Industry)కు పరిచయమై 44 ఏండ్లు అవుతోంది.
‘మీకు తెలిసిన ఈ చిరంజీవి..చిరంజీవిగా పుట్టినరోజు . 1978 సెస్టెంబర్ 22న ‘ప్రాణం ఖరీదు ‘ ద్వారా ప్రాణం పోసి, ప్రాణప్రదంగా నా ఊపిరై, నా గుండె చప్పుడై, అన్నీ మీరే అయి 44 సంవత్సరాలు నన్ను నడిపించారు. నన్నింతగా ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను.. ‘అని ట్వీట్ చేశాడు.
చిరంజీవి గాడ్ఫాదర్తోపాటు బాబీ డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య, మోహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలు చేస్తున్నాడు.
Chiranjeevi the Actor as you all know was born today, 22 September 1978, 44 years ago! I owe this limitless love and affection I receive from you all, to this day!
I owe everything to this day!
Humbled and Grateful! 🙏🙏🙏#PranamKhareedu #22Sept1978#DebutMovieRelease pic.twitter.com/LoFcpEo9Zo
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2022
Read Also : Aishwarya Trisha selfie | సెట్స్‌లో ఐశ్వర్యరాయ్, త్రిష సెల్ఫీ..క్రేజీ కాంబో కోసం వెయిటింగ్
Read Also : The Ghost Training video | ‘ది ఘోస్ట్’ కోసం నాగార్జున ట్రైనింగ్..ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Alia Bhatt | బ్రహ్మాస్త్ర-2లో ఈ స్టార్ హీరోయిన్ ఉంటే బాగుంటుందన్న అలియాభట్..!
Read Also : KARAN JOHAR | ఆ వారసుడిపై కన్నేసిన కరణ్ జోహార్..నెట్టింట్లో పేలుతున్న సెటైర్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

