I Am The Danger | రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కూలీ. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున విలన్ పాత్ర పోషించారు. అయితే ఇందులో నాగార్జునపై చిత్రీకరించిన ‘ఐ యామ్ ద డేంజర్’ అనే పాట పూర్తి వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. అనిరుధ్ రవిచందర్ ఈ పాటకు సంగీతం అందించారు. ఈ పాటలో నాగార్జున స్టైల్, స్వాగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోవైపు ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.