“బడ్డీ’కి వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమాలోని కామెడీ, ఎమోషన్స్, యాక్షన్‌తోపాటు టెడ్డీబేర్ క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. తమిళ్ ‘టెడ్డీ’లోని ఒక లైన్ మాత్రమే తీసుకొని కంప్లీట్‌గా కొత్త కథతో ఈ సినిమా చేశాను. కథ చెప్పగానే సింగిల్ సిట్టింగ్‌లో శిరీష్ ఓకే చేశారు. ఆయనతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. అది ఈ సినిమాతో కుదిరింది.’ అన్నారు దర్శకుడు శామ్ ఆంటోన్. ఆయన దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా రూపొందిన చిత్రం ‘బడ్డీ’. కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై, థియేటర్లలో ప్రదర్శింపబడుతున్నది. ఈ సందర్భంగా దర్శకుడు శామ్ ఆంటోన్ విలేకరులతో ముచ్చటించారు. ‘ఇది పూర్తిగా థియేటర్ల కోసమే చేసిన సినిమా. ఇందులో టెడ్డీకి ఎక్స్ప్రెషన్స్ తీసుకురావడం మాకు పెద్ద టాస్క్‌గా మారింది. ఎందుకంటే ఆ పాత్ర ఎమోషన్ వర్కవుట్ అయితే సినిమా హిట్. అందుకే చాలా శ్రమించాం. ైక్లెమాక్స్ ఫైట్‌తో పాటు ఇందులో యాక్షన్ సీక్వెన్స్ అన్నింటికీ మంచి అప్లాజ్ వస్తున్నది. ముఖ్యంగా హిప్హాప్ తమిళ సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్.’ అని తెలిపారు శామ్ ఆంటోన్.