‘సినిమా చూసి అందరూ హార్ట్‌ఫుల్‌గా నవ్వుకుంటున్నారు. ‘మత్తువదలరా’ వరల్డ్‌లో బాబు లాంటి పాత్రను నాకిచ్చిన దర్శకుడు రితేష్‌కి, నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. సత్యతో వర్క్ చేయడం వెరీ వెరీ హ్యాపీ. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్.’ అని కథానాయకుడు శ్రీసింహ కోడూరి అన్నారు. ఆయన, సత్య ప్రధానపాత్రధారులుగా రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన హిలేరియర్స్ థ్రిల్లర్ ‘మత్తు వదలరా 2’. ఫరియా అబ్దుల్లా కథానాయిక. మైత్రీ మూవీమేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. స్టార్ దర్శకులు గోపీచంద్ మలినేని, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, అనుదీప్, మహేశ్‌బాబు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై చిత్ర బృందానికి అభినందనలు అందించారు. రితేష్ రానా వంటి క్లారిటీ ఉన్న దర్శకుడు దొరకడం తమ అదృష్టమని, విజువల్ ఫీస్ట్‌లా సినిమా తీశాడని, థియేటర్లలో ప్రేక్షకుల నవ్వులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, ప్రతి చోటా అద్బుతమైన స్పందన వస్తున్నదని నిర్మాతలు తెలిపారు. ఇంకా దర్శకుడు రితేష్ రానా, సత్య, సంగీత దర్శకుడు కాలభైరవ, పంపిణీదారుడు శశిధర్‌రెడ్డి, నటుడు రాజా కూడా మాట్లాడారు.