ChandraHass | పాపులర్ టీవీ యాక్టర్ ప్రభాకర్ కుమారుడు, రామ్ నగర్ బన్నీఫేం చంద్రహాస్ (ChandraHass) హీరోగా నటిస్తోన్న మూవీ బరాబర్ ప్రేమిస్తా. సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈవెంట్‌కు డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ, యాక్టర్లు జెడీ చక్రవర్తి, ఆది గెస్టులుగా హాజరయ్యారు. ఈవెంట్లో చంద్రహాస్ మాట్లాడుతూ.. జయంత్ సీ పరాన్జీ డైరెక్ట్ చేసిన తీన్మార్,శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలకు నేను అభిమానిని అన్నాడు. అద్భుతమైన కమ్‌బ్యాక్ ఎంట్రీ ఇచ్చిన ఆది అన్న నాకు స్పూర్తి. జేడీ చక్రవర్తి సార్ ఇప్పటికీ అలానే ఉన్నారు. ఈ సినిమా ఒక సెకను కూడా బోర్ కొట్టదు. లెక్కలేనన్ని, ఊహించని ట్విస్టులుంటాయి. డైరెక్టర్ సంపత్ చాలా అందంగా సినిమాను తెరకెక్కించారు. నన్ను బాగా చూపించారు. ప్రేక్షకులు బరాబర్ ప్రేమిస్తాను చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నానన్నాడు.
బరాబర్ ప్రేమిస్తా పెద్ద హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నానని జయంత్ సీ పరాన్జీ అన్నారు. ఈ మూవీలో అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సీసీ క్రియేషన్స్, ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ నిర్మిస్తున్నారు.
Attitude Star #ChandraHass and #MegnaMukherjee at #BarabarPremistha Pre Release Event pic.twitter.com/MxRwHcY8fR
— Sai Satish (@PROSaiSatish) February 2, 2026