Nagabandham | పెదకాపు ఫేం విరాట్ కర్ణ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం నాగబంధం (Nagabandham). అడ్వెంచరస్ మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌ను మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న గ్రాండ్‌గా లాంచ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ నయా లుక్ విడుదల చేశారు మేకర్స్. గుప్తనిధులు, వాటికి రక్షణగా ఉన్నట్టుగా అగ్రెసివ్ లుక్‌లో ఉన్న కోబ్రాను తాజా పోస్టర్లో చూడొచ్చు.
నాగబంధం చిత్రంలో ఇస్మార్ట్ భామ నభానటేశ్, ఐశ్వర్య మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, నిక్ స్టూడియోస్, తారక్ సినిమాస్ బ్యానర్లపై అభిషేక్ నామా, కిశోర్ అన్నపురెడ్డి, లక్ష్మి ఐరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో వస్తోన్న నాగబంధం చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. వేసవి కానుకగా థియేటర్లలో సందడి చేయనుండగా.. రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తెరకెక్కించి డెవిల్ తర్వాత అభిషేక్ నామా నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ్ ఆలయాల్లో గుప్త నిధుల ఆవిష్కరణల స్పూర్తిగా వస్తోన్న ఈ చిత్రంలో వచ్చే క్లైమాక్స్ ఇదివరకెన్నడూ చూడని విధంగా ఉండబోతుందట. క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారని… గ్లోబల్ యాక్షన్ అడ్వెంచరస్ కొరియోగ్రఫర్ Kecha Khamphakdee ఈ హై ఆక్టేన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నాడని ఇప్పటికే ఓ వార్త మూవీ లవర్స్‌లో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది.
Get ready for the epic reveal. The highly anticipated #Nagabandham teaser drops on Mahashivaratri, Feb 15th. #NagabandhamTeaser pic.twitter.com/bSLmODK6XP
— BA Raju’s Team (@baraju_SuperHit) February 2, 2026