బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలతో లవర్‌బాయ్‌గా కోట్లాదిమంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు సిద్దార్థ్ (Siddharth) . చాలా కాలం తర్వాత ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి డైరెక్షన్లో మహాసముద్రం సినిమాతో మళ్లీ టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. తాను నటనను ప్రేమించడానికి కారణం..విభిన్నమైన పాత్రలు చేసే అవకాశం రావడమేనని అంటున్నాడు.
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న హిందీ వెబ్‌సిరీస్ Escaype Live తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సిద్దార్థ్. డిస్నీ+హాట్ స్టార్ (Disney + Hotstar)లో ప్రీమియర్ కానుంది. ఈ నేపథ్యంలో నేషనల్ మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు సిద్దార్థ్. ఏదైనా ఇంట్రెస్టింగ్ రోల్స్ చేయాలని ఆఫర్లు వస్తే తాను హిందీ సినిమా (Bollywood) ల్లోకి తిరిగి వస్తానని అన్నాడు.
‘నేను ఢిల్లీ కుర్రాడినని ప్రజలు చాలా సార్లు మరచిపోతారు. నేను హిందీ మాట్లాడే అబ్బాయిని. నాకు భాషలో మంచి పట్టు ఉంది. అయితే సౌత్ సినిమాల్లో చాలా పనిచేశాను. హిందీ అనేది నాకు ఎప్పుడూ ఒక హాబీగా ఉంటుంది. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినప్పుడు బాలీవుడ్‌కు తిరిగొస్తా. ఇది రెగ్యులర్ రోల్ కాదు ఈ పాత్రలో నన్ను ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. డిఫరెంట్ రోల్స్ వచ్చే వరకు యాక్టింగ్ చేస్తా..లేదంటే వేరే ఉద్యోగం చూసుకుంటానన్నాడు సిద్దార్థ్.