గురువారం 04 జూన్ 2020
Cinema - Feb 20, 2020 , 13:02:05

'షీ సేఫ్‌' యాప్‌ను ప్రారంభించిన సినీనటి సాయిపల్లవి

'షీ సేఫ్‌' యాప్‌ను ప్రారంభించిన సినీనటి సాయిపల్లవి

హైదరాబాద్‌ : హెచ్‌ఐఐసీలో సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తాధ్వర్యంలో మహిళా సాధికారత సదస్సు జరిగింది. ఈ సదస్సులో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌, ఐజీ స్వాతిలక్రా, టెస్సీ థామస్‌, సినీనటి సాయిపల్లవితో పాటు పలువురు పాల్గొన్నారు. మహిళల భద్రత, ఇతర అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. సైబరాబాద్‌ ఐటీ కారిడార్‌ పరిధిలోని మహిళా ఉద్యోగుల భద్రత కోసం రూపొందించిన 'షీ సేఫ్‌' అనే ప్రత్యేక యాప్‌ను సాయిపల్లవి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నటి సాయిపల్లవి మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మహిళలకు హైదరాబాద్‌లో ఉన్న భద్రత మరెక్కడా లేదని సాయిపల్లవి స్పష్టం చేశారు. పోలీసుల భద్రతతో మహిళలు నిశ్చింతగా ఉంటున్నారని తెలిపారు. పోలీసులకు సహకరించడం మన బాధ్యత అని సాయి పల్లవి పేర్కొన్నారు. 


logo