ఆసక్తికర చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్లో తన ఉనికిని కాపాడుకుంటున్నది అందాల తార హ్యూమా ఖురేషి. ఆమె ఖాతాలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘డబుల్ ఎక్సెల్’. ఈ చిత్రంలో సోనాక్షీ సిన్హాతో కలిసి నటిస్తున్నది హ్యూమా. మంచి నటిగా తనకున్న పేరును ఈ సినిమా మరింత పెంచనుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసిందీ తార. ‘డబుల్ ఎక్సెల్ లాంటి సినిమాను మనం గతంలోనే నిర్మించి ఉండాల్సింది. సమాజానికి చూపించాల్సిన, చెప్పాల్సిన కథ ఇది. ఇందులో నటిస్తున్నందుకు గర్వంగా ఉంది’ అని పేర్కొంది.