ఈ వారం కెప్టెన్సీ టాస్క్ బరిలో శ్రీరామ్ చంద్ర, శ్వేత, సన్నీలు కెప్టెన్ పోటీదారులుగా నిలబడ్డారు. వీరిలో ఎవరైతే కెప్టెన్ పోటీదారులుగా అనర్హులు అనుకుంటున్నారో వారి బెల్ట్‌పై కత్తితో పొడవాలని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో హౌజ్‌మేట్స్ అందరు సన్నీని బలి పశువుగా ఎంచుకున్నారు. సిరి ఇన్ఫ్లూయెన్స్ వలన షణ్ముఖ్, జెస్సీలు కూడా సన్నీకి పొడిచారు.
లోబో, విశ్వలు కూడా సన్నీకి కత్తిపోట్లు పొడిచారు. దీంతో సన్నీ ఎమోషనల్ అయ్యాడు. ప్రియ, నటరాజ్ మాస్టర్, యాంకర్ రవి, ప్రియాంక కూడా సన్నీకే పొడిచింది. అయితే శ్రీరామ్‌తో సరైన రిలేషన్ మెయింటైన్ చేయని మానస్ ఆయనకు కాకుండా శ్వేతని పొడిచాడు. అయితే సన్నీని ఇంటి సభ్యులు కత్తితో పొడిచిన ప్రతిసారి సిరి తెగ సంబరపడిపోయింది.
మొత్తంగా అందరికంటే తక్కువ కత్తిపోట్లు.. ఎక్కువ మంది ఇంటి సభ్యులు సపోర్ట్ చేయడంతో శ్రీరామ్ బిగ్ బాస్ హౌస్‌కి నాలుగో వారం కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. కెప్టెన్సీకి అవకాశం ఉన్న శ్వేతకు మానస్ కత్తి గుచ్చడంతో అయోమయానికి లోనయ్యాడు సన్నీ. అతడిని కడిగిపాడేస్తానని ఆవేశంగా మాట్లాడాడు. మరోవైపు పింకీ.. మానస్ కెప్టెన్సీ టాస్క్‌లో పాల్లోనందుకు చాలా ఫీలైపోయింది.