Leo Movie Telugu Rights | టాక్‌తో సంబంధంలేకుండా విజయ్ సినిమాలు కోట్లు కొల్లగొడుతాయని ఆ మధ్య దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు అనిపిస్తున్నాయి. ఇదేం సినిమారా బాబు అనుకున్న ‘బీస్ట్’ రెండోందలకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ఔరా అనిపించింది. ఇక సీరియల్ అంటూ ముద్ర పడిన ‘వారసుడు’ సైతం ముడొందల కోట్లు కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. ఇలా ప్రతీ సినిమాకు విజయ్ మార్కెట్ పెరుగుతూనే ఉంది. ఇక ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌లో విడుదల కానుంది.
ఒకప్పటితో పోలిస్తే విజయ్‌కు ఇప్పుడు తెలుగులోనూ మార్కెట్ భారీగా పెరగిపోయింది. తుపాకీ నుంచి ఆయన సినిమాలు ఇక్కడ కూడా కళ్లు చెదిరే కలెక్షన్లు రాబడుతూ బంపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఆయన మార్కెట్ విలువ రూ.15 కోట్లకు పైమాటే. ఇక ఇదిలా ఉంటే లియో సినిమా కోసం తెలుగులో భారీ డిమాండ్ ఏర్పడుతుంది. ఈ క్రమంలో నిర్మాతలు కూడా కనీవిని ఎరుగుని రేంజ్లో హక్కుల రేటు చెబుతున్నారు. టాలీవుడ్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం లియో సినిమా తెలుగు హక్కులకు ఏకంగా రూ.22 కోట్లు ఫిక్స్ చేశారట. అయితే ఈ నెంబర్ చూసి తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ఆమడ దూరం పారిపోతున్నారట.
ఎందుకంటే దసరాకు భగవంత్ కేసరీతో పాటు, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో ఓ రేంజ్లో అంచనాలున్నాయి. ఆ స్థాయి అంచనాలను తట్టుకుని లియో నిలబడుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే రెండు పెద్ద తెలుగు సినిమాలతో పోటీ పడుతుందంటే లియోకు థియేటర్ కౌంట్ కూడా పెద్దగా ఉండదు. దాంతో పలువురు డిస్ట్రిబ్యూటర్లు వెనక్కు తగ్గుతున్నారు. మరీ లియో మేకర్స్ రేటు తగ్గించి ఇప్పుడున్న విజయ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని హక్కులు ఇస్తారా లేదంటే వాళ్లే ఓన్ రిలీజ్ చేసుకుంటారా అనేది క్లారిటీ రావాలంటే మరో నాలుగు నెలలు వేచి చూడాల్సిందే.