టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం మేజర్ (Major). 26/11 ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే (Oh Isha Song) సాంగ్‌ను రిలీజ్ చేయగా..మంచి స్పందన వస్తోంది. కాగా ఇపుడు ‘హృదయమా’ అంటూ సాగే మెలోడీ ట్రాక్‌ను విడుదల చేశారు మేకర్స్.
సందీప్ లవ్‌ట్రాక్, రక్షణశాఖలోకి వెళ్లే ప్రయాణం, సెంటిమెంట్స్ తో సాగుతున్న పాటను సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ పాడాడు. కృష్ణకాంత్, వీఎన్వీ రమేశ్ కుమార్ ఈ పాట రాయగా..శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందించాడు. ‘నిన్నే కోరే నే నిన్నే కోరే..ఆపేదెలా నీ చూపునే..లేనే లేనే నే నువ్వై నేనే..దారే మారే నీ వైపునే’ అంటూ సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకునేలా సాగుతుంది.
ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ (saimanjrekar) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సోనీ పిక్చర్స్ ఇండియా, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. స్టార్ హీరో మహేశ్ బాబు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. మేజర్ మూవీ జూన్ 3న తెలుగు, హిందీతోపాటు పలు భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.