Hrithik Roshan | ఒకవైపు స్టార్ నటుడిగా సినిమాలు చేస్తునే మరోవైపు క్రిష్ 4తో దర్శకుడిగా మెగాఫోన్ పట్టబోతున్నాడు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్. అయితే ఈ రెండు కాకుండా తాజాగా డిజిట్ల్ రంగంలోకి హృతిక్ అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. హృతిక్ ప్రైమ్ వీడియో ఇండియాతో (PrimeVideoIN) కలిసి కొత్త థ్రిల్లర్ సిరీస్‌ను నిర్మించబోతున్నాడు. స్ట్రోమ్(Storm) అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ వెబ్ సిరీస్‌కి ‘టబ్బర్’ ఫేమ్ దర్శకుడు అజిత్‌పాల్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో హృతిక్ ప్రేయసి సబా అజాద్ (SabaAzad), మలయాళ నటి పార్వతి తిరువోతు (ParvathyThiruvothu), అలయా ఎఫ్ (AlayaF), శ్రీష్టి శ్రీవాస్తవ, ర్రమా శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తుంది. హృతిక్ రోషన్ స్వంత నిర్మాణ సంస్థ HRX ఫిల్మ్స్ ద్వారా, ఫిల్మ్‌క్రాఫ్ట్ ఫిల్మ్స్ (FilmKRAFTfilms) సహకారంతో ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. కాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
HRITHIK ROSHAN ENTERS THE DIGITAL ARENA: HRX FILMS – PRIME VIDEO JOIN HANDS FOR WEB SERIES… #HrithikRoshan steps into the streaming space with #EshaanRoshan for their debut venture under the #HRXFilms banner.
Titled #Storm [working title], the thriller drama is directed by… pic.twitter.com/vgSg4Tnyre
— taran adarsh (@taran_adarsh) October 10, 2025