ముంబై : నోరూరించే పిజ్జా అంటే ఇష్టపడని వారు అరుదుగా కనిపిస్తుంటారు. ఆరోగ్యంపై అమిత శ్రద్ధ కనబరిచే సెలబ్రిటీలు సైతం పిజ్జా అంటే పడిపోతుంటారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) కార్బోహైడ్రేట్లు లేని పిజ్జాను ఎంజాయ్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఎగ్ వైట్స్‌తో హెల్దీ పిజ్జా ట్రై చేయాలని హృతిక్ డిసైడ్ అయ్యాడు.
క్లాసిక్ పిజ్జా, పాస్తా సాస్ బదులుగా సన్ డ్రైడ్ పెస్టోకు మొగ్గుచూపాడు. వెన్న, జున్ను వాడేందుకు వాటి స్దానంలో సాల్మన్, ఆనియన్స్‌తో సరిపెట్టేశాడు. ఈ హెల్ధీ పిజ్జా ఫొటోను హృతిక్ తన ఇన్స్టాగ్రాం స్టోరీస్‌లో షేర్ చేశాడు. నో కార్బ్ పిజ్జా ! అని ఈ పోస్ట్‌కు బాలీవుడ్ స్టార్ హీరో క్యాప్షన్ ఇచ్చాడు.
ఇది ఓకేనా అంటూ తన ఫిట్నెస్ ట్రైనర్ క్రిస్ గెధిన్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోరాడు. ఫిట్నెస్ను ప్రేమించే వారు రుచితో రాజీపడకుండా ఈ టేస్టీ రెసిపీలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు..అవేంటంటే..
ఓట్స్ క్రస్ట్ పిజ్జా
బీట్రూట్ ఊతప్పం
మూంగ్‌దాల్ నగెట్స్
నాన్ ఫ్రైడ్ మసాలా బనానా చిప్స్
Read More :
BRS Manifesto | బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు ఇవే..