బాలీవుడ్ అగ్ర నటుడు హృతిక్‌రోషన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మాతగా అడుగుపెట్టబోతున్నారు. స్వీయ నిర్మాణ సంస్థ హెచ్ఆర్ఎక్స్ ఫిలిమ్స్ పతాకంపై ఆయన ‘స్ట్రామ్’ (వర్కింగ్ టైటిల్) పేరుతో ఓ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించబోతున్నారు. ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అర్జిత్పాల్సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో పార్వతి తిరువోతు, అలయా , శ్రిష్టి శ్రీవాత్సవ, రమా శర్మ, సబా అజాద్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించనున్నారు.
ముంబయి నేపథ్యంలో జరిగే థ్రిల్లర్ కథాంశమిదని, అనేక చిక్కుముడులను విప్పుతూ ఉత్కంఠను పంచుతుందని దర్శకుడు తెలిపారు. ఇలాంటి రా అండ్ రస్టిక్ ఎలిమెంట్ ఉన్న కథాంశంతో ఓటీటీలో నిర్మాతగా అడుగుపెట్టడం ఆనందంగా ఉందని, గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే సిరీస్ ఇదని హృతిక్‌రోషన్ తెలిపారు ఈ సిరీస్ చిత్రీకరణను త్వరలో మొదలుపెట్టబోతున్నారు.