బాలీవుడ్లో యాక్షన్, రొమాంటిక్ చిత్రాల కథానాయకుడిగా హృతిక్‌రోషన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా ‘క్రిష్’ సిరీస్ చిత్రాలు ఆయనకు తిరుగులేని ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. దీంతో నాలుగోభాగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘క్రిష్-4’ అనౌన్స్మెంట్ త్వరలో ఉంటుందని బాలీవుడ్ మీడియాలో కూడా వార్తలొచ్చాయి. తాజాగా ఈ సినిమా తాలూకు అప్డేట్ను అందించారు హృతిక్‌రోషన్ తండ్రి, దర్శకుడు రాకేష్ రోషన్. ‘క్రిష్-4’కు హృతిక్‌రోషన్ దర్శకత్వం వహిస్తారని ఆయన ప్రకటించారు. ‘25 ఏళ్ల క్రితం నిన్ను హీరోగా పరిచయం చేశా.
ఇప్పుడు దర్శకుడిగా అవకాశమిస్తున్నా. ‘క్రిష్’ వంటి పాపులర్ సిరీస్‌తో నువ్వు దర్శకుడిగా ఇంట్రడ్యూస్ కావడం ఆనందంగా ఉంది. ఈ కొత్త ప్రయాణంలో నీకు అన్నీ విజయాలు దక్కాలని కోరుకుంటున్నా’ అని రాకేష్‌రోషన్ తన సోషల్‌మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. దాదాపు 700కోట్ల భారీ బడ్జెట్‌తో నాలుగో భాగానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ‘క్రిష్’ సిరీస్‌లో మూడు చిత్రాలకు రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. దీంతో నాలుగు భాగాన్ని కూడా ఆయన డైరెక్ట్ చేస్తారని వార్తలు వినిపించాయి. రాకేష్ రోషన్ తాజా ప్రకటనతో ‘క్రిష్-4’పై స్పష్టత వచ్చిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.