Hrithik Roshan | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్. రీసెంట్గా ఒక ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గోన్న హృతిక్‌ని యాంకర్ మీ నా ఫేవరేట్ కో స్టార్ ఎవరని అడుగగా.. హృతిక్ మాట్లాడుతూ.. తన ఫేవరెట్ కో స్టార్ తెలుగు యాక్టర్ ఎన్టీఆర్ అని చెప్పాడు. అతనోక అద్భుత నటుడే కాకుండా మంచి మనిషి. వార్ 2లో అతడితో కలిసి నటించడం ఆనందంగా ఉందంటూ హృతిక్ రోషన్ చెప్పుకోచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వార్ 2. ఈ సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తుండగా.. వార్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. జాన్ అబ్రహాం, కియారా అద్వానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Jr NTR is such an amazing teammate! Hrithik on #WAR2 #HrithikRoshan pic.twitter.com/U1lWq4htXI
— HrithikRules.com (@HrithikRules) April 5, 2025