తెలుగు హీరోలైన బన్నీ, రామ్‌చరణ్, తారక్.. పానిండియా ప్రేక్షకులకు చేరువయ్యారు. కోలీవుడ్ హీరో ధనుష్ కూడా టాలీవుడ్, బాలీవుడ్‌లలో ఫేమస్. ఇప్పటివరకూ సౌత్ సినిమాపై అంతగా ఆసక్తి చూపించని బాలీవుడ్ హీరోలు సైతం మెల్లమెల్లగా దక్షిణం వైపు చూడ్డం మొదలుపెట్టారు. ఇప్పటికే సల్మాన్‌ఖాన్, ఆమీర్‌ఖాన్ సౌత్‌లో నటించిన విషయం తెలిసిందే.
అయితే.. వీరిద్దరూ స్పెషల్ రోల్స్ మాత్రమే చేశారు. బాలీవుడ్లో గ్రీక్ గాడ్‌గా పేరెన్నికగన్న హృతిక్ రోషన్ మాత్రం ఇంకో అడుగు ముందుకేసి, ఓ సౌత్ సినిమాలో హీరోగా నటించేందుకు రెడీ అయ్యారనేది లేటెస్ట్ న్యూస్. ప్రతిష్టాత్మక హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నదట. మైథాలజీ నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నదని, హృతిక్ నటించే తొలి స్ట్రెయిట్ సౌత్ సినిమా ఇదే అవుతుందని ఫిల్మ్ వర్గాల టాక్.