NTR – Hrithik Roshan | దేవరతో సాలిడ్ హిట్ అందుకున్న అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వార్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో హృతికి రోషన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. తారక్ కీలక పాత్రలో మెరుస్తున్నాడు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్.. చొక్కా లేని సన్నివేశాల్లో నటించబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో టెంపర్ సినిమాలో ఓ పాటలో.. అలాగే అరవింద సమేత సినిమాలో ఫైట్ సీక్వెన్స్ లో షర్ట్ లేకుండా కనిపించాడు తారక్. తాజాగా వార్ 2 లోనూ అదే చేస్తున్నట్లు తెలుస్తుంది. వార్ 2 లో హృతిక్ ఎన్టీఆర్ మధ్య ఫైట్ ఉంటుందని తెలుస్తోంది. అంతేగాకుండా నాటు నాటు తరహాలో ఇద్దరు కలిసి డాన్స్ కూడా చేయబోతున్నట్లు దర్శకుడు అయన్ ముఖర్జీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం తారక్ డాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే తారక్ ఫ్యాన్స్‌తో పాటు హృతిక్ ఫ్యాన్స్‌కు పండగనే చెప్పాలి.