War 2 | హృతిక్‌రోషన్, తారక్, అలియాభట్.. ఇలా క్రేజీ కాంబినేషన్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ‘వార్ 2’పై బాలీవుడ్లో ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. తారక్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో తెలుగు రాష్ర్టాల్లోనూ ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముంబాయ్‌లో శరవేగంగా జరుగుతున్నది.
ఇదిలావుంటే..ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ని మేకర్స్ హైదరాబాద్‌లో ప్లాన్ చేశారట. దీనికోసం భారీ బడ్జెట్లో సెట్ల నిర్మాణం కూడా జరుగుతున్నదట. ఆగస్ట్‌లో మొదలయ్యే ఈ షెడ్యూల్లో హృతిక్‌రోషన్, ఎన్టీయార్లపై యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నారట. ఇది సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ అని తెలుస్తున్నది. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ఆగస్ట్ 14న విడుదల కానుంది.