‘వార్ 2’ సినిమాను ఇష్టంతో కష్టపడి తెరకెక్కించాం. ప్యాషన్‌తో చేసిన ఈ సినిమా నేడు విడుదల కానుంది. ‘వార్ 2’ ఓ అద్భుతం.. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అందరూ థియేటర్లలోనే చూడండి. సినిమా చూసిన వారు దయచేసి కథలోని సీక్రెట్లను, ట్విస్ట్‌లను రివీల్ చేయొద్దు. అలా రివీల్ చేసేవాళ్లను కూడా మీరే ఆపాలి. ఇది మీడియాకు, ప్రేక్షకులకు, అభిమానులకు మా విజ్ఞప్తి’ అని ‘వార్ 2’ కథానాయకులైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వారిద్దరూ కలిసి నటించిన ‘వార్ 2’ నేడు విడుదలకానున్న సందర్భంగా వారు ఈ ప్రకటన విడుదల చేశారు. “వార్2’ని తొలిసారి చూస్తున్నప్పుడు కలిగే ఆనందం, థ్రిల్ మాటల్లో చెప్పలేం. మీరేకాదు, మీ తర్వాత చూసేవాళ్లు కూడా ఆ ఆనందాన్ని అనుభవించాలంటే.. కథలోని సీక్రెట్లు, ట్విస్టులు రివీల్ చేయకూడదు. అలా చేస్తే మీ తర్వాత చూసేవారికి ఆ అనుభూతి దక్కదు. ‘దయచేసి ‘వార్ 2’ని రహస్యంగా ఉంచండి.’ అని ఎన్టీఆర్ ప్రత్యేకంగా చెప్పారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన విషయం తెలిసిందే.