భవిష్యత్‌లో సైబర్ వార్ ఎలా వుండబోతుంది? పాక్, చైనా మద్దతు వున్న హ్యాకర్ల సమూహంతో భారతదేశానికి వ్యతిరేకంగా సైబర్ గూఢచర్యం ముప్పు ఎలా వుంటుంది? ఇలాంటి పలు అంశాలతో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం ‘కోకో’ గ్లింప్స్‌ను ఇటీవల ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.
హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం జూన్ మూడోవారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. చిత్ర దర్శకుడు జైకుమార్ మాట్లాడుతూ ‘వియత్నాం, లడఖ్, చైనా, కేరళ, హైదరాబాద్‌లో 100 రోజుల పాటు చిత్రీకరణ చేస్తాం. 2024 వేసవిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, వియత్నామీస్, తైవాన్ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి నిర్మాత: సందీప్ రెడ్డి వాసా.